ఇంతగా
మరింతగా ...
మరి మరి అంతగా
కలవరిస్తానెందుకో...
ఓసారి చల్లగాలిలా
మరోసారి సుడిగాలిలా
అల్లుకునే నీవు
దగ్గరో దూరమో అర్థం కాదు
అయినా
నువ్వంటే ఇష్టమని చెప్పడం
వెన్నెలజల్లులు కురుస్తున్నట్టుగా
ఎంత ఇష్టంగా ఉంటుందో తెలుసా
ఇపుడిపుడే
నా ఇష్టానికి
కొత్త బెంగొకటి వచ్చి చేరింది
నేనంటూ లేకపోతే ఏమైపోతావోనని
అయినా
నీతోనే పూర్తిగా ఉండి
ఆరడి పెట్టాలనిపించదు..
నీవంటే ఇష్టం అన్నమాట
చెప్పక తప్పుకోవాలనిపించదు
ఓయ్
చాలా చాలా ఇష్టమంటే
నిన్ను ప్రేమించడమే కదా
మరొకటి తెలియలేదు మరి